మైనర్ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం
మైనర్ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం
ఎన్టీఆర్ బ్యూరో 11, )టుడేస్ న్యూస్) : జిల్లా పరిధిలోని, పెనుగంచిప్రోలు మండలంలోని. అనిగండ్లపాడు గ్రామ పరిధిలో ఉన్న మునేటి కాలవపై ఉన్న కట్ట గ్రావెల్ను అక్రమంగా గింజుపల్లి వీరభద్రం అక్రమ ప్రైవేటు వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకున్నారని ప్రభుత్వానికి ఆ గ్రామ రైతు యానాల కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. వేలాది ఎకరాలకు నీరందించే మునేటి కాలమని ప్రభుత్వ నిధుల ద్వారా పటిష్ట పరిచేందుకు కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేశారని అలాంటి విలువైన కాలువ కట్ట గ్రావెల్ను వీరభద్రం జెసిబి ఇతర వాహనాల సహకారంతో ప్రైవేటు వ్యక్తులకు అమ్మి వేయడం జరిగిందని దీని వలన కాలవ కట్ట రూపురేఖలు మారిపోయి రైతాంగానికి తీవ్ర నష్టం జరగనుందని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసిన మెదట మైనర్ ఇరిగేషన్ అధికారులు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని దానిలో గింజుపల్లి వీరభద్రం అనేవారు కాలవకట్టను ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తించామని, వారితోనే తిరిగి మరల మరమ్మత్తులు చేయించడం జరిగిందని పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వాస్తిని ధ్వంసం చేసి విలువైన గ్రావెల్ను అమ్మి సొమ్ము చేసుకుని తిరిగి మరలా గ్రావెల్ కు బదులు దుబ్బ మట్టి ని నామమాత్రము పోయించి ఇరిగేషన్ అధికారులు కూడా చేతులు దులుపుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి లక్షలాది రూపాయలు మట్టిని అమ్ముకున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని . దీన్ని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళటం జరుగుతుందని కోటేశ్వరరావు తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0