అపరమేధావి డా.గుగ్గిళ్ల దివ్యమూర్తికి హనుమకొండలో గద్దర్ స్మారక కళా పురస్కారం

Jan 25, 2026 - 21:16
 0  2
అపరమేధావి డా.గుగ్గిళ్ల దివ్యమూర్తికి హనుమకొండలో గద్దర్ స్మారక కళా పురస్కారం

అపరమేధావి డా.గుగ్గిళ్ల దివ్యమూర్తికి హనుమకొండలో గద్దర్ స్మారక కళా పురస్కారం

నేలకొండపల్లి,జనవరి25,(వెలుగు నాడు ప్రతినిధి) : ఖమ్మం జిల్లా,నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి అపరమేధావి డాక్టర్ గుగ్గిళ్ల దివ్యమూర్తికి గద్దర్ స్మారక కళా పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని డాక్టర్ గుగ్గిళ్ల దివ్యమూర్తికి తెలుగు వెలుగు సాహితి వేదిక వారు అందజేయడం జరిగింది. ఈ పురస్కారాన్ని డాక్టర్ దివ్యమూర్తి హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో ప్రముఖ హాస్యనటులు సదానందం (ఆర్ఎస్ నంద) చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. తదనంతరం డాక్టర్ దివ్యమూర్తిని ప్రముఖులు సన్మానించారు. దివ్యమూర్తికి ఉన్న ప్రతిభను బట్టి ఈ అవార్డును అందజేస్తున్న సంస్థ సభ్యులు తెలియజేశారు. తనకు ఈ అవార్డు సంతోషంగా డాక్టర్ దివ్యమూర్తి తెలియజేశారు. ఇప్పటివరకు తనకు 66 అవార్డులు వచ్చాయని, 116 వేదికల మీద సన్మానం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే , వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మన్నెం నాగమల్లేశ్వరి, పోలోజు రాజ్ కుమార్, అద్దంకి నాగరాజు, ఐపీఎస్ రావుల గిరిధర్, సురేష్ లాల్, వెంపటి శ్రావణి, అప్పినపల్లి భాస్కరాచార్యులు, పొన్నెకంటి శ్రీనివాసచారి, వేముల తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్