అంతర్జాతీయ యోగ దినోత్సవం వేడుకగా చేద్దాం
అంతర్జాతీయ యోగ దినోత్సవం వేడుకగా చేద్దాం
యం.డి.ఓ స్వర్ణ లత
గన్నవరం 19, (వెలుగు నాడు ప్రతినిధి) అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని వేడుకగా చేద్దామని గన్నవరం యం.పి.డి.ఓ స్వర్ణ లత అన్నారు. ఈ నెల 21 వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న 12 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని అనుబందంగా నియోజక కేంద్రంమైన గన్నవరం బాలికల ఉన్నత పాఠశాల లో యోగాంద్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు స్వర్ణ లత తెలిపారు. 21 వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న యోగ కార్యక్రమంలో గన్నవరం పట్టణంలో ఉన్న గన్నవరం, బాలుర, బాలికల దావాజీగూడెం పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కేసరపల్లి విద్యార్థులతో యోగాసనాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు.అలాగే యోగాంద్ర అన్ని పాఠశాలల లో తప్పనిసరిగా ఉదయం 7 గంటలకు నిర్వహించాలని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు గుడివాడ డి వై ఈ ఓ కొండా రవి కుమార్ సూచించారు. ఈ కార్యక్రమం లో గన్నవరం మండల విద్యా శాఖధికారిణి ఆర్. కమల, గన్నవరం బాలికలు, భాలురు, దావాజీగూడెం ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పార్వతి, సునీల, మహతి, గన్నవరం నియోజకవర్గ క్రీడా సమన్వయ కర్త ధనియాల నాగరాజు, సీనియర్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు సి.హెచ్ చంద్ర శేఖర్, వ్యాయమ ఉపాధ్యాయులు కే గీత, కే టాన్యా గిరి, యన్.శ్రీదేవి, కే విజయ కుమారి,తదితరులు హాజరైనారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0