ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా విజయ్ ప్రకాష్
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా విజయ్ ప్రకాష్
వేంపల్లె జూన్ 02, (వెలుగు నాడు ప్రతినిధి) : మండలంలోని ఇడుపులపాయ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) ట్రిపుల్ ఐటీ నూతన డైరెక్టర్‌గా డాక్టర్ గడ్డం విజయ్ ప్రకాష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం క్యాంపస్ లోని వివిధ విభాగపు అధిపతులతో సమావేశమై చర్చించారు. అనంతరం డైరెక్టర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంతో పాటు సంస్థను విద్యా, పరిశోధనా రంగాల్లో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా వినూత్న కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సంస్థ అభివృద్ధికి అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ, అందరి సమన్వయంతో ట్రిపుల్ ఐటీని దేశంలోనే ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి డాక్టర్ పి రవికుమార్ , డాక్టర్ కొండారెడ్డి, డాక్టర్ రత్నకుమారి, అసోసియేట్ డిన్స్ , ఎస్టాబ్లిష్మెంట్ కో ఆర్డినేటర్లు మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0