పేట మున్సిపాలిటీకి కొత్త కమీషనర్
పేట మున్సిపాలిటీకి కొత్త కమీషనర్
జగ్గయ్యపేట జూన్11, (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కొత్త కమీషనర్ గా పీవీవీడి ప్రసాద్ నియమితులయ్యారు.గురువారం ఆయన మర్యాదా పూర్వకంగా ఎమ్మెల్యే తాతయ్యను కలిశారు.జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవల అందజేత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తూ పట్టణాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, శ్రీరాం కృష్ణ నిహార్, కాంట్రాక్టర్ కాకులపాటి కృష్ణమోహన్, మేనేజర్ కృష్ణ వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0