షేర్ మహమ్మద్‌పేట చిల్లకల్లు గ్రామాలలో సర్ పై అవగాహన సదస్సులో శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

Jun 28, 2026 - 22:57
 0  10
షేర్ మహమ్మద్‌పేట చిల్లకల్లు గ్రామాలలో  సర్ పై అవగాహన సదస్సులో శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

షేర్ మహమ్మద్‌పేట చిల్లకల్లు గ్రామాలలో సర్ పై అవగాహన సదస్సులో శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

జగ్గయ్యపేట జూన్ 28, (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట మండలం, షేర్ మహమ్మద్‌పేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరియు చిల్లకల్లు గ్రామంలో గ్రామపంచాయతీ ఆఫీస్ పరిధిలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు గారి అధ్యక్షతన నిర్వహించిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎమ్మెల్యే & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ,ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హుడైన పౌరుని పేరు ఓటరు జాబితాలో ఉండేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. SIR ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుల సవరణ, పేర్ల తొలగింపు వంటి అంశాల్లో ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.అలాగే గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించడం, అర్హులైన వారందరి పేర్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవడం, ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేసి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు దరఖాస్తులు సమర్పించేలా సహకరించాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు మరియు ఎన్నికల వ్యవస్థకు మధ్య వారధిగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్