ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు 44,104 దరఖాస్తులు 

Jun 2, 2026 - 14:39
 0  10
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు 44,104 దరఖాస్తులు 

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు 44,104 దరఖాస్తులు 

ప్రత్యేక కేటగిరీ ధృవీకరణకు షెడ్యూల్ విడుదల - జూన్ 12 న ఎంపిక జాబితా విడుదల 

ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ 

వేంపల్లె జూన్ 02 , (వెలుగు నాడు ప్రతినిధి) : ఇడుపులపాయ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించి మొత్తం 44,104 దరఖాస్తులు అందినట్లు ప్రవేశాల కన్వీనర్ డా. అమరేంద్ర కుమార్ తెలిపారు. ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవీకరణ కోసం ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్థుల ధృవీకరణ కార్యక్రమం ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. బిఎస్ జి, సిఎపి, ఎన్ సిసి , స్పోర్ట్స్ కేటగిరీల అభ్యర్థులను తేదీల వారీగా విభజించి ధృవీకరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంబంధిత విధ్యార్ధులకు ఈ-మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయడంతో పాటు, ధృవీకరణకు ఎంపికైన వారి జాబితాను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. జూన్ 5న సిఎపి కేటగిరీకి చెందిన 85 మంది, ఎన్ సిసి కేటగిరీకి చెందిన 497 మంది, స్పోర్ట్స్ కేటగిరీకి చెందిన 167 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 749 మందికి ధృవీకరణ నిర్వహించనున్నారు. జూన్ 6న సిఎపి కేటగిరీలో 97 మంది, ఎన్ సిసి లో 487 మంది, స్పోర్ట్స్‌లో 164 మంది అభ్యర్థులు సహా మొత్తం 748 మందికి ధృవీకరణ చేపట్టనున్నారు. అదేవిధంగా జూన్ 8న బిఎస్ జి కేటగిరీకి చెందిన 282 మంది, సిఎపి లో 55 మంది, ఎన్ సిసి లో 305 మంది, స్పోర్ట్స్‌లో 119 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 761 మందికి ధృవీకరణ నిర్వహించనున్నారు. పి హెచ్ కేటగిరీ కింద మొత్తం 195 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కేటగిరీకి సంబంధించిన ధృవపత్రాలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ద్వారా ధృవీకరించనున్నందున, పిహెచ్ అభ్యర్థులు పై ప్రత్యేక కేటగిరీ ధృవీకరణకు హాజరుకావాల్సిన అవసరం లేదని తెలిపారు. మొత్తంగా ప్రత్యేక కేటగిరీ కింద 2,453 మంది అభ్యర్థులు ఉండగా, అందులో ఎన్ సి సి కేటగిరీలో అత్యధికంగా 1,289 మంది ఉన్నారు. స్పోర్ట్స్ కేటగిరీలో 450 మంది, బిఎస్ జి లో 282 మంది, సిఎపి లో 237 మంది, పిహెచ్ కేటగిరీలో 195 మంది అభ్యర్థులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆర్జీయూకేటీ ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితాను జూన్ 12న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ డా. అమరేంద్ర కుమార్ తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్