శేరిలింగంపల్లి డివిజన్‌లో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల పరిశీలన

Jan 27, 2026 - 20:33
 0  4
శేరిలింగంపల్లి డివిజన్‌లో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల పరిశీలన

శేరిలింగంపల్లి డివిజన్‌లో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల పరిశీలన

శేరిలింగంపల్లి, జనవరి 27, (వెలుగు నాడు ప్రతినిధి) : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో రూ.36 లక్షల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజలు ఏ శుభకార్యమైనా సౌకర్యవంతంగా నిర్వహించుకునే విధంగా కమ్యూనిటీ హాల్‌ను అన్ని వసతులతో నిర్మిస్తున్నామని తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి ఆలస్యం లేదా నిర్లక్ష్యం జరగకూడదని కార్పొరేటర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, భీష్మ చారీ, రాజేష్ చారీ, సందయ్య నగర్ అధ్యక్షులు బస్వరాజ్, సాయి కృష్ణ, నర్సింహా రెడ్డి, రాజు, ఖాసీం, రెడ్డి, సబియా, కుమార్ తదితర స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్