అనుమానంతోభార్య హత్య,కూతురిపై దాడి. భర్త ఆత్మహత్యాయత్నం

Jan 21, 2026 - 01:21
 0  9
అనుమానంతోభార్య హత్య,కూతురిపై దాడి. భర్త ఆత్మహత్యాయత్నం

అనుమానంతోభార్య హత్య,కూతురిపై దాడి. భర్త ఆత్మహత్యాయత్నం

 సిద్దిపేట, జనవరి20, (వెలుగు నాడు ప్రతినిధి ): సిద్దిపేట జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. అనంతరం కూతురిపైన కూడా దాడి చేసి,తానూ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అనుమానంతో భర్త ఎల్లయ్య తన భార్య శ్రీలతను కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేశాడు.ఆ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురిపైనా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.ఈ ఘటన అనంతరం ఎల్లయ్య తానూ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.తీవ్ర గాయాలపాలైన కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.ఎల్లయ్య ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కుటుంబ కలహాలు,అనుమానాలే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్