ఉత్తమ ఆర్పీలను అభినందించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య
ఉత్తమ ఆర్పీలను అభినందించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
జగ్గయ్యపేట, జనవరి 27, (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట, మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు నిష్టతో, సమర్థవంతంగా సేవలు అందిస్తున్న ఆర్‌పిలు మరియు డ్వాక్రా గ్రూపులను గుర్తించి ఉత్తమ ఆర్‌పిలు, ఉత్తమ డ్వాక్రా గ్రూపులుగా ఎంపిక చేయడం జరిగింది.ఈ సందర్భంగా నిన్న 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మిషా చేతుల మీదుగా ఎంపికైన వారికి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. వారి సేవా తత్వం, కష్టపడే నిబద్ధతకు ఇది ఒక గుర్తింపుగా నిలిచింది.అనంతరం మంగళవారం, ఉత్తమ ఆర్‌పిలుగా ఎంపికైన వారు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారినిహృదయపూర్వకంగా అభినందించి, భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమానికి అంకితభావంతో సేవలు అందిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఈ ఎల్ ఎఫ్ ప్రెసిడెంట్ షేక్ నజీమూన్, సెక్రటరీ గోనెల పద్మావతి, ట్రెజరర్ కోమటి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0