దేశానికి వెన్నెముక రైతే మన అన్నదాత ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) 

Jun 30, 2026 - 09:57
 0  12
దేశానికి వెన్నెముక రైతే మన అన్నదాత ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) 

దేశానికి వెన్నెముక రైతే మన అన్నదాత ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) 

కన్నెవీడు గ్రామంలో ఘనంగా నిర్వహించిన జిల్లాస్థాయి ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) 

జగ్గయ్యపేట, జూన్ 29, (వెలుగు నాడు ప్రతినిధి)  :  జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం, కన్నెవీడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో ఘనంగా నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ,20 సూత్రాల అమలు చైర్మన్ లంక దినకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.సాంప్రదాయ వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారికి గ్రామ రైతులు, మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అలంకరించిన ఎడ్లబండిపై ఎమ్మెల్యే ని ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకువెళ్లగా, గ్రామస్తులు హర్షధ్వానాలతో స్వాగతం తెలిపారు. జానపద కళారూపాలు, మంగళవాయిద్యాలు, సంప్రదాయ వేషధారణలతో కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.సభా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ తో కలిసి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, సహకార శాఖ, వ్యవసాయ అనుబంధ విభాగాలు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాల్స్‌ను సందర్శించి రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నూతన పంటల సాగు విధానాలు, యంత్రాల వినియోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మమేకమై వారి సమస్యలు, సూచనలు తెలుసుకొని ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.అనంతరం సాంప్రదాయ వ్యవసాయానికి ప్రతీకగా నిర్వహించిన అరక దున్నే కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) స్వయంగా పాల్గొని రైతులతో కలిసి పొలంలో అరక దున్నారు. రైతు జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. రైతుల కష్టాన్ని గుర్తిస్తూ వారి శ్రమకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే గారు అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ.ఏరువాక పౌర్ణమి తెలుగు రైతు సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పండుగ అని, భూమాతను పూజించి కొత్త వ్యవసాయ సంవత్సరానికి శ్రీకారం చుట్టే పవిత్రమైన రోజుగా రైతులు భావిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని రైతులందరికీ హృదయపూర్వక ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.వ్యవసాయమే దేశానికి వెన్నెముక, రైతే మన అన్నదాత" అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, ఆధునిక వ్యవసాయ విధానాలను అమలు చేస్తోందని వివరించారు.భూమాత ఆశీస్సులతో ఈ ఏడాది సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రతి రైతు కుటుంబం సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నాణ్యమైన విత్తనాలు, శాస్త్రీయ పద్ధతులతో సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు అధికారులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.గ్రామీణ వ్యవసాయ వ్యవస్థ బలోపేతం, సాగునీటి వసతుల అభివృద్ధి, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ కొండయ్య, వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, కానూరి కిషోర్, గ్రామ సొసైటీ చైర్మన్ కర్నాటి శంకర్, సాగర్ల కృష్ణవేణి, చావా నాగేశ్వరరావు, నెల్లూరి శ్రీనివాసరావు, జామ ఆనందరావు, దారెళ్లి చిరంజీవి, ఆదిమల్ల రమేష్, చిట్టూరి రమేష్, కర్నాటి వివేక్, ధారావతు శ్రీను, కూరపాటి నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్