గోదావరి పుష్కరాలు-2027 పనుల ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

Jun 2, 2026 - 22:50
 0  3
గోదావరి పుష్కరాలు-2027 పనుల ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

గోదావరి పుష్కరాలు-2027 పనుల ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష కాకినాడ జూన్ 02,)వెలుగు నాడు ప్రతినిధి) : కాకినాడ కలెక్టరేట్ నుంచి హాజరైన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, జేసీ అపూర్వ భరత్ తాళ్ళరేవు, కాజులూరు మండలాల పరిధిలోని ఘాట్ల పనుల పై కలెక్టర్ ప్రత్యేక సమీక్షరాబోయే గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణ, ఏర్పాట్ల పై మంగళవారం అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ఇప్పటివరకు ఉన్న ఘాట్లకు మరమత్తులు చేయడం, అవసరమైన చోట ఉన్న ఘాట్లను అదనంగా పొడిగించడం, కొత్త ఘాట్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు కల్పనపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జిల్లా అధికారులతో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్షముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ కాకినాడ జిల్లా పరిధిలోని పుష్కర ఏర్పాట్లపై స్థానిక అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ముఖ్యంగా జిల్లాలోని తాళ్ళరేవు, కాజులూరు మండలాల పరిధిలో ఉన్న గోవలంక, గోపులంక, పిల్లంక, పెదలంక ఘాట్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రతిపాదనలపై ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.2027 గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలోని అధికారులు ముందస్తు ప్రణాళికలతో పని చేయాలన్నారు. జిల్లా పరిధిలోని తాళ్ళరేవు, కాజులూరు మండలాల్లో గల పుష్కర ఘాట్లలో భక్తులకు అవసరమైన మౌలిక వసతులు, ఘాట్ల విస్తరణ, పారిశుద్ధ్యం, తాగునీరు మరియు రవాణా సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా దేవాలయాలు అనుకుని ఉన్న పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయాలన్నారు. ఆయా ఘాట్లకు వెళ్లే అప్రోచ్ రోడ్లు పనులు, వాహనాల పార్కింగ్ స్థలం గుర్తింపు, అందులోని సదుపాయాల పైన ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్వో డా.తిప్పేనాయక్, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎండీ మతిన్, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎవీఎస్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డీటీసీ ఎన్.శ్రీధర్, ఆర్ అండ్ బి ఎస్ఈ జీ కాంఠు, అగ్నిమాపక అధికారి సీహెచ్ కృపావరం, డీఎంహెచ్ఓ డా.నరసింహా నాయక్, ఐ అండ్ పీఆర్ డీడీ పి.తిమ్మప్ప, ఎస్బీ డీఎస్పీ సత్యనారాయణ ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్