విబి జి రామ్ జి చట్టం రద్దు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ధ్రువకుమార్ రెడ్డి
విబి జి రామ్ జి చట్టం రద్దు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ధ్రువకుమార్ రెడ్డి
పులివెందుల, జనవరి 19, ( వెలుగు నాడు ప్రతినిధి) : మున్సిపాలిటీ పరిధిలోని (నగరి గుట్ట) క్రిస్టియన్ కాలనీలో సోమవారం కాంగ్రెస్ పార్టీ పులివెందుల పట్టణ అద్యక్షులు భోనాల ఖాదర్, వల్లి, కాంగ్రెస్ పార్టీ "మహిళా అధ్యక్షురాలు విజయ' ఉపాద్యక్షులు చంద్రబాబు ల తోకలిసి "విబి జీ రామ్ జి'చట్టం వద్దు 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం, చట్టం అమలు పరచాలని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్‌రెడ్డి,కోరారుఈసందర్భంగా వారు మాట్లాడుతూ,మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంటే కేంద్రం 90% నిధులు రాష్ట్ర ప్రభుత్వం 10% మాత్రమే నిధులు ఇస్తున్నందువల్ల ఇప్పటివరకు ఇబ్బంది జరగకుండా ఉపాధి కూలీలకు పని దొరకడమే కాకుండా కూలీల సొమ్ము ఎవరి బ్యాంకు ఖాతాలో వాళ్లకు వచ్చేవి అన్నారు.అది కాకుండా 'విబి జీ రామ్ జీ' చట్టం అమలు అయితే కేంద్రం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చాలి అందువల్ల రాష్ట్రాలు ఈ రుణాన్ని చెల్లించలేక ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తారన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో సంతకాలు సేకరించి తీర్మానించారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీను, సాయి కుమార్,లోకేష్,శ్యామ్, సిల్వ కుమార్,తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0