పాడేరు ఘటనపై తీవ్ర ఆగ్రహం
పాడేరు ఘటనపై తీవ్ర ఆగ్రహం
పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి తాతపూడి రాజశేఖర్ మాదిగ
ఉదయగిరి మే 19: (వెలుగు నాడు ప్రతినిధి) : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో పాస్టర్ అభినయ్ దర్శన్‌పై జరిగిన దారుణ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సామ్యూల్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ తాతపూడి రాజశేఖర్ మాదిగ పేర్కొన్నారు. దేవుని సేవ చేస్తున్న వ్యక్తిపై ఇలాంటి క్రూరమైన దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ తమ మత విశ్వాసాలను ఆచరించే హక్కు ఉందని, భయపెట్టి లేదా దాడులు చేసి సత్యాన్ని అణచివేయలేరని అన్నారు. గతంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ హత్య జరిగిన ఘటనను గుర్తు చేస్తూ, ఇప్పుడు మరోసారి పాస్టర్‌పై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. సమాజంలో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాలు ఉండవచ్చని, అయితే వాటిని హింసాత్మక దాడుల రూపంలో వ్యక్తపరచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రాజశేఖర్ మాదిగ అన్నారు. రోజు రోజుకు దళిత క్రైస్తవులపై వేధింపులు, దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత క్రైస్తవ పోరాట సమితి ఆధ్వర్యంలో, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0