ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిమాపక అవగాహన సదస్సు
ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిమాపక అవగాహన సదస్సు
గురజాల ,ఏప్రిల్ 2 ,(వెలుగు నాడు ప్రతినిధి) : గురజాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో గురువారం అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బందికి ఫైర్ స్టేషన్ వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఆసుపత్రులు , పాఠశాలలు సినిమా హోటల్లో, ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక పరికరాలను ఎలా వాడాలో వివరించారు .ప్రజల ప్రాణాలను కాపాడడంలో ముందస్తు జాగ్రత్త కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0