కాలుష్య సమస్య నుండి జగ్గయ్యపేట ప్రాంతాన్ని రక్షించండి
కాలుష్య సమస్య నుండి జగ్గయ్యపేట ప్రాంతాన్ని రక్షించండి
జగ్గయ్యపేట జనవరి 17 (వెలుగు నాడు ప్రతినిధి) : భూగ్రహం మాత్రమే జీవ మానవ పరిణామానికి ఆవాస్ యోగ్యమైనది, జీవజాతుల మనుగడ, జీవవైవిద్య సంపదకు ప్రకృతి నిలయంగా పర్యావరణ సమతుల్యానికి ఆధారంగా ఉంది. సహజ సిద్ధమైన జీవ.జీవ వేతర అంశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనడానికి దోహదపడుతుంది. ప్రకృతి దైవంగా భావించే సంస్కృతి, సాంప్రదాయాలు. జీవనశైలిలో రోజు రోజు మార్పు రావడం వలన. వాతావరణం బలహీనపడి, జీవులపై కాలుష్య ప్రభావం చూపుతుంది. ప్రకృతి పంచభూతాలు ఒత్తిడికి గురై, జీవవరణం బలహీన పడడానికి దోహదపడుతుంది. పారిశ్రామికరణ ద్వారా ఏర్పడే వ్యర్థ పదార్థాలైన విషవాయువులు, దుమ్ము, దూళి, రేడియోధార్మిక కిరణాలు వాతావరణంలో వెదజల్లడం వలన, ఓజోన్ రక్షిక పోర బలహీనమై, హరిత వనాలపై ప్రభావం చూపడం వలన ఆక్సిజన్ వంటి ప్రాణవాయువు తగ్గి పోవడమే కాక, సకల జంతువులలోమార్పులు ఏర్పడి,అంతర్జాతీయ ఉష్ణోగ్రతపెరిగిపోయి,అకాల వర్షాలు తగ్గిపోతూ భూకంపాలు తరచుగా రావడం వలన, జీవన మనుగడ ప్రమాదపు అంచులలోకి చేరింది. విషవాయువులు , వ్యర్థ రసాయనాలు పేరుకుపోవడం ద్వారా హృదయ కోసం సమస్యలు, శ్వాస సంబంధ, సుఖ సంసారాలు కూడా తగ్గటం. రక్తంలో ఆక్సిజన్ తగ్గి పక్షవాత సమస్యలు.శర్మ సంబంధం సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రకృతి సిద్ధ ఆహార ఉత్పత్తులు పోషక పదార్థాలపై ప్రభావం చూపటమే కాక, మానవ ఆరోగ్యం పై,దెబ్బతీస్తున్నాయి.పక్షుల మనుగడ కష్టతరం కావడానికి కారణభూతమవుతున్నాయి. ప్రాణదారమైన స్వచ్ఛమైన నీరు, గాలి, ప్రధానంగా కాలుష్యానికి గురి కావడం ద్వారా వాతావరణ సమతుల్యత తప్పిపోయి, పూర్తి జీవ వర్ణాన్ని బలహీన పరుస్తున్నాయి. ఖనిజ సంపద కరిగిపోయి, భూమి సమతుల్యంపై ప్రభావం చూపిస్తున్నాయి.ఆధునిక జీవనంలో అడవులు, హరితవనాలు కనుమరుగై పోవడానికి కాలుష్యమే ప్రధాన కారణం, ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అన్నమాట దేవుడెరుగు ప్రజల ఆరోగ్యాంకోసం,పంటలకోసం జగ్గయ్యపేట ప్రాంతాన్ని కాలుష్యం నుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0