కొత్తగూడెం న్యాయవాదుల విధుల బహిష్కరణ

Feb 16, 2026 - 23:05
 0  11
కొత్తగూడెం న్యాయవాదుల విధుల బహిష్కరణ

కొత్తగూడెం న్యాయవాదుల విధుల బహిష్కరణ.

కొత్తగూడెం, ఫిబ్రవరి 16, (వెలుగు నాడు ప్రతినిధి) : హైదరాబాద్ లో అత్తపూర్ న్యాయవాది మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు నిరసనగా ఫేడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఫర్ తెలంగాణ ఇచ్చిన పిలుపులో భాగంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జనపరెడ్డి గోపి కృష్ణ అధ్యక్షతన కొత్తగూడెం బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి న్యాయవాది మహమ్మద్ ఖదీర్ దారుణ హత్య కు నిరసనగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు విధులు బహిష్కరణ చేశారు. అనంతరం ఉపాధ్యక్షడు జనపరెడ్డి గోపి కృష్ణ అధ్యక్షతన కోర్టు గేట్ బయట ప్లకార్డ్ లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ కు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వలను గోపి కృష్ణ డిమాండ్ చేశారు. న్యాయవాదులకు సంరక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ఫేడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లను జనపరెడ్డి గోపి కృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు హన్మంతరావు, చిరంజీవి రావు, పి. నాగేశ్వరరావు, కే.పుల్లయ్య, మన్మోహన్, యెర్రాపాటి కృష్ణ, శ్రీధర్, మహమ్మద్ సాదిక్ పాషా, మారపాక రమేష్, మహేష్, చిన్ని కృష్ణ, విజయ్, రమేష్, ఏర్ర శ్రీను, మధన్ మోహన్, కేపి, తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్