యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తూ సమాజానికి ఆదర్శంగానిలవాలి .తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్

May 18, 2026 - 11:59
May 18, 2026 - 12:06
 0  11
యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తూ సమాజానికి ఆదర్శంగానిలవాలి .తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్

యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తూ సమాజానికి ఆదర్శంగానిలవాలి .తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్.

ఉయ్యూరు మే 17, (వెలుగు నాడు ప్రతినిధి): . ఉయ్యూరులోని రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు యార్లగడ్డ రమేష్, సిగటాపు ప్రసాద్, పరిమి సజిత్,లోకేష్ ల జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొని రాజేంద్రప్రసాద్ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.నేటితరం యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉన్నదని, యువకులు తలుచుకుంటే అసాధ్యాన్ని , సుసాధ్యం చేయగల శక్తి వారిలో ఉన్నదని, ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న తెలుగుదేశం నాయకులు యార్లగడ్డ రమేష్, పరిమి సజిత్, ప్రసాద్, లోకేష్ లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు జంపన వీర శ్రీనివాస్, గోపాలస్వామి, రఘురాం, ప్రదీప్, తెలుగుదేశం నాయకులు వికృతి రాజా, భాషి ,సాయి, వీరబాబు, వెంకటేశ్వరరావు, బాలాజీ, రమేష్, మధుసూదన్ రావు, సూర్య తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 1
admin వెలుగునాడు తెలుగు న్యూస్