శంకర్ నేత్రాలయం సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం
శంకర్ నేత్రాలయం సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం
బాపులపాడు, జనవరి 29: (వెలుగు నాడు ప్రతినిధి ) : కృష్ణాజిల్లా గన్నవరం, నియోజకవర్గం బాపులపాడు మహాత్మా గాంధీ నగర్‌లో శంకర్ నేత్రాలయం, ఏలూరు వారి సౌజన్యంతో మహమ్మదీయ మజీత్ అంజుమాన్ కమిటీ బాపులపాడు మరియు ముస్లిం ఐక్యవేదిక గన్నవరం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.ఈ శిబిరంలో శంకర్ నేత్రాలయం ఏలూరు నుండి వచ్చిన వైద్య బృందం డాక్టర్ డొక్కు దివ్య, డాక్టర్ పాముల ఆనంద్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. టెక్నీషియన్ షేక్ ఇస్మాయిల్ సాంకేతిక సహకారం అందించారు. రోగులకు సమగ్రంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన చికిత్సతో పాటు మందులు ఉచితంగా అందజేశారు.దృష్టి లోపం ఉన్నవారికి శంకర్ నేత్రాలయం ద్వారా ఉచితంగా కళ్లజోడ్లు పంపిణీ చేశారు. అలాగే కంటి పొర, శుక్లాలు (క్యాటరాక్ట్) సహా ఇతర తీవ్రమైన కంటి సమస్యలు ఉన్న రోగులను ఫిబ్రవరి 3వ తేదీన శంకర్ నేత్రాలయం వారి సొంత వాహనంలో ఏలూరులోని వారి హాస్పిటల్‌కు తరలించి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మొత్తం 150 మంది రోగులు కంటి పరీక్షలు చేయించుకొని వైద్యం పొందారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పలువురు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మహమ్మదీయ మజీత్ అంజుమాన్ కమిటీ బాపులపాడు గౌరవ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ భారీ, అధ్యక్షుడు సయ్యద్ జానీ భాష, ఉపాధ్యక్షుడు షేక్ రఫీ, కార్యదర్శి సయ్యద్ జమురుద్ భాషా, జాయింట్ సెక్రటరీ షేక్ జానీ, కమిటీ సభ్యుడు షేక్ గౌస్ భాషా, ముస్లిం ఐక్యవేదిక గన్నవరం నియోజకవర్గ కార్యదర్శి షేక్ కరీం బాషా, మజీద్ ఇమామ్ షేక్ రఫీతో పాటు మహాత్మా గాంధీ నగర్ ప్రాంత ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0