శ్రీ కోదండ రామస్వామి వారికి శాశ్వత కైంకర్య దాతలు యార్లగడ్డ వెంకట రాంబాబు దంపతులు

Jan 29, 2026 - 00:36
 0  1
శ్రీ కోదండ రామస్వామి వారికి శాశ్వత కైంకర్య దాతలు యార్లగడ్డ వెంకట రాంబాబు దంపతులు

శ్రీ కోదండ రామస్వామి వారికి శాశ్వత కైంకర్య దాతలు యార్లగడ్డ వెంకట రాంబాబు దంపతులు

బాపులపాడు జనవరి 28: )వెలుగు నాడు ప్రతినిధి ) : హనుమాన్ జంక్షన్, బాపులపాడు మండలం రంగయ్య అప్పారావుపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి నిత్యం సమర్పించే మహా నైవేద్యానికి యార్లగడ్డ వెంకట రాంబాబు, స్వర్ణలత దంపతులు శాశ్వతముగా ప్రతినెల 26 కేజీలు బియ్యం కేజీ పెసరపప్పు అందచేయడానికి ముందుకు వచ్చినట్లు శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ కోశాధికారి పరుచూరి సుకన్య తెలియజేశారు. ఈ సందర్భంగా పరుచూరి సుకన్య మాట్లాడుతూ గతంలో ఆలయ అభివృద్ధి పనులకు యార్లగడ్డ వెంకట రాంబాబు, స్వర్ణలత దంపతులు 1,21,116 అక్షరాల (ఒకలక్ష ఇరవై ఒక్క వెయ్యి నూట పదహారు) రూపాయలు విరాళాన్ని అందజేశారని, స్వామివారి నిత్య పుష్ప అర్చనకు ప్రతి సంవత్సరం 6000 రూపాయలు శాశ్వతంగా అందచేస్తున్నారని, వారి తండ్రి కీర్తిశేషులు యార్లగడ్డ నాగేశ్వరరావు దేవాలయంలో మూల విరాట్ విగ్రహాలను సమర్పించినట్లు తెలియజేశారు. దాతల సహకారంతో స్వామివారికి నిత్య కైంకర్యాలతో పాటు పర్వదినాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పరుచూరి సుకన్య తెలియజేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్