పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయండి
పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయండి
పెడన, జనవరి 20, (వెలుగు నాడు ప్రతినిధి) : డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ బుధవారం పర్యటనను విజయవంతం చేయాలని జనసేన సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ వికృతి శ్రీనివాసరావు కోరారు. మంగళవారం మున్సిపాలిటీ తో పాటు పెడన, గూడూరు మండలాల జన సైనికులు, వీర మహిళలు పార్టీ సీనియర్ నాయకులతో పట్నంలోని పార్టీ కార్యాలయం వద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ పవన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కృత్తివెన్ను మండలం బోలుగొంది గ్రామానికి హెలికాప్టర్ ద్వారాచేరుకుంటారన్నారు. అనంతరం ర్యాలీగా పెద చందాల గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటారన్నారు. అంతేకాకుండా పెడన నియోజవర్గానికి నిధులు సమకూర్చే విషయంలో కూడా మాట్లాడతారని ఆయన చెప్పారు. సమావేశం అనంతరం బోలుగొంది గ్రామంలో హెలికాప్టర్ దిగే ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడి నుంచి భద్రత ఏర్పాట్లు ప్రత్యేక భద్రతా సిబ్బంది రోడ్ మ్యాప్ ను పరిశీలించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0