వైభవంగా తిరుమలగిరి ప్రదక్షిణ

Jun 30, 2026 - 10:02
 0  20
వైభవంగా తిరుమలగిరి ప్రదక్షిణ

వైభవంగా తిరుమలగిరి ప్రదక్షిణ

జగ్గయ్యపేట,జూలై 29, ( వెలుగు నాడు ప్రతినిధి )  : ప్రతి నెల పౌర్ణమి రోజున తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారిచే గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తారు.ఈ నెల సోమవారం పౌర్ణమి సందర్బంగా గిరి ప్రదక్షిణ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మేళ తాళాలతో కోలాటాలతో, భక్తుల గోవింద నామ స్మరణతో తిరుమలగిరి పరిసరాలు మార్మోగాయి.ఈ కార్యక్రమములో దేవస్థానం ప్రస్తుత ధర్మకర్తల మండలి చైర్మన్ గుమ్మా వెంకటేష్,పాలక మండలి సభ్యులు పునుగుపాటి పుల్లయ్య,చిలుకూరి శిరీష , శాస్త్రి, పల్లపు హేమసుధ,శ్రీ గణేష్ కోలాట బృందం, ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులందరికీ ఉచిత ప్రసాదంగా దద్దోజనం, టమాటా రైస్ వితరణ చేసినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి రంగారావు తెలియజేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్