అమరావతి అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు

Jun 16, 2026 - 22:58
 0  7
అమరావతి అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు

అమరావతి అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్

మోడీ నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి..

విజయవాడ జూన్ 16, (వెలుగు నాడు ప్రతినిధి) :   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విజయవాడ భవానిపురంలోని వాజపేయి పార్క్ వద్ద నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు. అనంతరం మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్క్‌లో స్థానిక వాకర్లతో కలిసి నడుస్తూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశ చరిత్రలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానమంత్రులలో ఒకరిగా నిలిచారని పేర్కొన్నారు. 2014కు ముందు పదేళ్ల పాటు దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణ పరిస్థితుల్లో ఉండేదని, ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందన్నారు. రైల్వే రంగంలో భారత్ విశేష ప్రగతి సాధించిందని, ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో రైల్వే విద్యుదీకరణ పూర్తి చేసిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ ఎనిమిది రెట్లు పెరిగిందని, 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ద్వారా దేశీయ ఉత్పత్తి సామర్థ్యంగణనీయంగావిస్తరించిందన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర నాయకులు ప్రధాని మోదీకి సమగ్ర వివరాలు అందించారని చెప్పారు. అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల సహాయం అందించగా, హడ్కో ద్వారా మరో రూ.11 వేల కోట్ల నిధులుసమకూర్చినట్లు.వెల్లడించారుఅమరావతిని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ప్రత్యేక రైల్వే లైన్ కోసం కూడా నిధులు కేటాయించినట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ప్రహ్లాద్ జోషి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పీవీఎన్ మాధవ్ సమన్వయంతోసమర్థవంతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే అభివృద్ధి నమూనాను తెలంగాణలో కూడా అమలు చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రగతికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా వికసిత భారత్ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్