మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ప్రజాదర్బార్

Jun 16, 2026 - 23:00
 0  9
మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ప్రజాదర్బార్

మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ప్రజాదర్బార్

ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి హామీ.

అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలకు ఆదేశం.

మైలవరం జూన్ 16,( వెలుగు నాడు ప్రతినిధి) :  మైలవరంలోని శాసనసభ్యుని కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఉదయం నుంచే కార్యాలయానికి చేరుకున్న నియోజకవర్గ ప్రజల నుంచి ఆయన నేరుగా వినతిపత్రాలను స్వీకరించారు. భూ వివాదాలు, పింఛన్లు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తదితర అంశాలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీదారుడితో ఎమ్మెల్యే స్వయంగా మాట్లాడి సమస్యల వివరాలను కూలంకషంగా తెలుసుకున్నారు. పలు సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తన దృష్టికి సమస్యలను తీసుకురావాలని సూచించారు.మైలవరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి వారం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.ప్రజాదర్బార్‌కు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించి వినతిపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే చొరవతో తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్