ప్రైవేట్ పాఠశాలల పై చర్యలేవీ
ప్రైవేట్ పాఠశాలల పై చర్యలేవీ
నిబంధనలను తుంగలో తొక్కిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎంఈఓ స్పందించాలి మరి
హైదరాబాద్ జూన్ 19, (వెలుగు నాడు ప్రతినిధి) : ప్రైవేట్ కార్పొరేట్ పేరిట పాఠశాల పేరుతో ముద్రించిన నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్, స్టేషనరీ వంటి వాటిని పాఠశాలలో విక్రయాలు జరుపవద్దని ఒక జీవో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో తనిఖీలు చేయకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా ఒక పాఠశాలలను ఏర్పాటు చేయాలంటే పాఠశాల నిబంధనల ప్రకారం తనిఖీ ఫీజు, అగ్నిమాపక శాఖ, ఎన్ఓసి, ట్రాఫిక్ పోలీసులు క్లియరెన్స్, శానిటరీ సర్టిఫికెట్, పాఠశాల భవన ప్రతిష్టత ధ్రువపత్రం, ఆటస్థలం ముఖ్యమైనవి. ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత విద్యాశాఖది. ఈ విధంగా చూసుకుంటే కొన్ని స్కూళ్లకు ఆట స్థలం లేకుండా అనుమతులు ఎలా ఇచ్చారు. ఈ స్కూళ్లపై చర్యలు తీసుకోవడంలో డీఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినపడుతున్నాయి. ఆట స్థలాలు ఎక్కడ.విద్యార్థులకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం ఆట స్థలం లేకపోతే పిల్లలు ఆట ఎక్కడ ఆడతారు. అనేది విద్యార్థులు తల్లిదండ్రులు మనోవేదన కానీ ఈ స్కూల్స్ మాత్రం ఆటస్థలం లేకుండానే విద్యాశాఖను తన ముడుపులతో సంతోష పెడుతున్నారని సమాచారం, పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల ఫైర్ సేఫ్టీ తనిఖీలు శూన్యం విద్యాశాఖ నిబంధనను బేకతారు చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా ఎందుకు పర్మిషన్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి. నిబంధనల విషయంలో కాసులకు కక్కుర్తి పడి అనుమతులు లేని పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నారని. బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాంతంలో అన్నీ కాదు కొన్ని ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలకు అనుమతులు లేకున్నా, రంగు రంగుల కరపత్రాలతో, హంగు ఆర్భాటాలతో, ఆకర్షించే విధంగా, లేనివి ఉన్నట్టుగా చూపిస్తూ మా పాఠశాలలో చేరితే ఫీజులో రాయితీ కల్పిస్తామని మాయ మాటలు చెప్పి చేరిన తర్వాత మొత్తం ఫీజు కట్టాలంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ మోసం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలలకు ప్రభుత్వం నుండి అనుమతులు ఉన్నాయా లేదా..? అని తెలుసుకోవాలని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.ధనార్జనే ధ్యేయంగా ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని అనుమతులు లేకున్నా ఇష్టానుసారంగా నడుపుతున్న, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని, అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అలాగే వదిలేస్తారా..? లేకపోతే స్కూళ్ళ పై చర్యలు తీసుకుంటారా లేదా..? అనేది సస్పెన్స్.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1