ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

Mar 15, 2026 - 23:03
 0  4
ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

తెలంగాణ, మార్చి 15, (వెలుగు నాడు ప్రతినిధి) : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో రెండో విడత జాబితా కింద ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ పథకం కింద స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. నాలుగు విడతలుగా లబ్దిదారుల అకౌంట్లలో వీటిని జమ చేస్తోంది. కాగా తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్