వైరా పట్టణ ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూస్తాం 

Feb 9, 2026 - 21:58
 0  9
వైరా పట్టణ ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూస్తాం 

వైరా పట్టణ ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూస్తాం 

పట్టణ అభివృద్ధి బాధ్యత తీసుకుంటా 

ఈ ఎన్నికలు వైరా పట్టణ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు

వైరా పట్టణంలో జరిగిన ప్రతి అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఓ వరం 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 

వైరా, ఫిబ్రవరి 9, ( వెలుగు నాడు ప్రతినిధి ) : వైరా ప్రాంతవాసిగా డిప్యూటీ సీఎం గా తాను వైరా పట్టణ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని, వైరా పట్టణ అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. రోడ్లు, డ్రైనేజీలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకొని భవిష్యత్తు తరాలకు వైరా పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా అందిద్దామని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. గత పది సంవత్సరాల మాదిరిగానే పట్టణాన్ని వదిలేద్దామా అనేది ఓటర్లు ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం కోరారు.వైరా పట్టణంలో జరిగిన ఏ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనలు, ప్రారంభాలు అన్ని కాంగ్రెస్ హయాంలోనే జరిగినవని అన్నారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. కొత్త పని ఒకటి కూడా లేదన్నారు. శాంతి కాలనీ ఎస్సీ, ఎస్టీ కాలనీ అన్ని కాంగ్రెస్ హయాంలో ఏర్పడినవే అన్నారు. కరెంటు, ఆసుపత్రి, కాలేజీ, డిగ్రీ కళాశాల అన్ని కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ వైరా పట్టణానికి ఓ వరం అన్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందన్నారు. విద్యా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు జూనియర్ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించారని తెలిపారు. ఐటిఐ ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా మార్చడం పాలిటెక్నిక్ కళాశాలలో మంజూరు చేశామని తెలిపారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే షాపులను కూలగొట్టి ఐదు సంవత్సరాలు అయ్యింది. మొండి గోడలతో వైరా పట్టణం కలతప్పిందని స్థానికులు వివరిస్తే నిన్నటికి నిన్న ఇక్కడే ఫైల్ తెప్పించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంజూరు చేయించినట్టు వివరించారు.వైరాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఫైల్ వడివడిగా ప్రాసెస్ జరుగుతుందని తెలిపారు. ఇక్కడి ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడిన వారే. వైరా ప్రాజెక్టును అభివృద్ధి చేసుకోవాలని కుడి ఎడమ కాలువలకు లైనింగ్ చేశాం. తిరిగి ప్రజా ప్రభుత్వం వచ్చాకే రెండవ దశ లైనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని తెలిపారు. గతంలో గ్రామపంచాయతీ బిల్డింగ్ చెరువు ఒడ్డున ఉండేదని, ఇప్పుడు ప్రధాన రహదారి మీదకు తీసుకొచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరున కట్టించిన ఘనత నాటి కాంగ్రెస్ సర్పంచ్ దుర్గాప్రసాద్ అని తెలిపారు. ఆధునిక వసతులతో స్మశాన వాటిక, నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్