దివ్యాంగులకు ఎలక్ట్రికల్ వాహనాల పంపిణీ

Jan 27, 2026 - 20:37
Jan 27, 2026 - 20:38
 0  9
దివ్యాంగులకు ఎలక్ట్రికల్ వాహనాల పంపిణీ

దివ్యాంగులకు ఎలక్ట్రికల్ వాహనాల పంపిణీ

మిర్యాలగూడ జనవరి 27 (వెలుగు నాడు ప్రతినిధి) : మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగులకు సహాయ ఉపకరణములు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ శంకర్ నాయక్,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ లుదివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్స్,ఎలక్ట్రికల్ మోటార్ త్రి విల్లర్స్ బైక్స్ పంపిణీ చేశారు.బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వ్యర్యంలో లబ్దిదారులకు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,దివ్యాంగుల,వయోవృద్ధుల సాధికారక శాఖ అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో, దివ్యాంగులకు చేయూత అందించేందుకు నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమానికి మా మిర్యాలగూడ నియోజకవర్గ వివ్యాధులు అందరి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.గడిచిన రెండున్నర సంవత్సరాలలో ప్రజా పాలనలో రాష్టంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజా ప్రభుత్వంగా ప్రజలఆశీర్వాదాలుఅందుకుంటున్నాము అన్నారు.మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు అందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని,తెలియజేశారు. ఈ కార్యక్రమం అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్