కులాంతర వివాహాల ప్రోత్సాహానికి ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.30 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Mar 29, 2026 - 22:04
 0  6
కులాంతర వివాహాల ప్రోత్సాహానికి ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.30 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

కులాంతర వివాహాల ప్రోత్సాహానికి ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.30 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ, మార్చి 29, (వెలుగు నాడు ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం వేధింపుల నిరోధక చట్టం కింద బాధితులకు ఆర్థిక సహాయం అందించడానికి ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.30 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కేటాయించారు. జగిత్యాల జిల్లాకు రూ.1.75 కోట్లు, గద్వాల జిల్లాకు రూ.1.25 కోట్లు, మేడ్చల్ జిల్లాకు రూ.90 లక్షలు, హైదరాబాద్ జిల్లాకు రూ.1.6 కోట్లు కేటాయించారు. అదేవిధంగా గద్వాల, జగిత్యాల, రంగారెడ్డి జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.1 కోటి చొప్పున ప్రత్యేకంగా కేటాయించినట్లు ఎస్సీ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ నిధుల ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించడం,బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం, అలాగే సామాజిక న్యాయం సాధించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య సమాజంలో సమానత్వాన్ని బలోపేతం చేయడమే కాకుండా, వెనుకబడిన వర్గాల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్