గ్రీన్ ట్యాక్స్ కష్టాలు టెక్నికల్ సమస్యలతో వాహనదారుల ఇబ్బందులు
గ్రీన్ ట్యాక్స్ కష్టాలు టెక్నికల్ సమస్యలతో వాహనదారుల ఇబ్బందులు
హైదరాబాద్, మార్చి 17,(వెలుగు నాడు ప్రతినిధి ) : హైదరాబాద్లో గ్రేటర్ పరిధిలో 15 ఏళ్లు పూర్తయిన వాహనాలను గ్రీన్ట్యాక్స్తో రెన్యూవల్ చేయించుకోవడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీఏ వెబ్సైట్లో స్లాట్ బుక్ కాకపోవడం, మీసేవ కేంద్రాల్లో గ్రీన్ట్యాక్స్ ఆప్షన్ కనిపించకపోవడం వంటి సాంకేతిక సమస్యలతో రెన్యూవల్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో గడువు దాటిన వాహనాలపై నెలకు రూ.500 చొప్పున జరిమానా విధించనున్నారు. గడువులోపు గ్రీన్ట్యాక్స్ చెల్లిస్తేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. భారీ జరిమానాల కారణంగా చాలామంది వాహనదారులు రెన్యూవల్ చేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0