గొల్ల గూడెం లలో ప్రత్యేక పారిశుధ్య 

Mar 18, 2026 - 10:52
 0  5
గొల్ల గూడెం లలో ప్రత్యేక పారిశుధ్య 

గొల్ల గూడెం లలో ప్రత్యేక పారిశుధ్య 

పెద్దపల్లి మార్చి 17 (వెలుగు నాడు ప్రతినిధి) : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యములో మంగళవారం మంథని మున్సిపల్ పరిధిలోని బోయిని పేట, దుబ్బగూడెం,గొల్ల గూడెం లలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముండ్ల పొదలు తొలగించి మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతు అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు జంబోజు సమ్మయ్య, పోలు శివ, గుండా రాజు, నక్క నాగేంద్ర, అట్టెం రాజు, సబ్బని సమ్మయ్య, నడిపి రాజు మరియు ప్రజలు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్