నేడు రైతులకు ఫార్మర్ కిట్స్ పంపిణీ మంత్రి తుమ్మల

Mar 18, 2026 - 10:57
 0  7
నేడు రైతులకు ఫార్మర్ కిట్స్ పంపిణీ మంత్రి తుమ్మల

నేడు రైతులకు ఫార్మర్ కిట్స్ పంపిణీ మంత్రి తుమ్మల

తెలంగాణ, మార్చి 17, (వెలుగు నాడు ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం కింద 'ఫార్మర్ కిట్స్' పంపిణీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ప్రారంభించనున్నారు. ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సచివాలయం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 489 క్లస్టర్లలోని 61,125 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి కిట్లో క్లాత్ బ్యాగ్, ఫీల్డ్ గైడ్, ఐడీ కార్డ్, క్యాలెండర్, టోపీ, డైరీ వంటి వస్తువులను అందజేస్తారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్