మంథని వాసికి అరుదైన గౌరవం 

Mar 12, 2026 - 03:09
 0  8
మంథని వాసికి అరుదైన గౌరవం 

మంథని వాసికి అరుదైన గౌరవం 

డాక్టర్ ప్రియాంకకు ఘనంగా సన్మానం

పెద్దపల్లి, మంథని, మార్చి 11,(వెలుగు నాడు ప్రతినిధి) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మంథని కి చెందిన డాక్టర్ రామడుగు ప్రియాంక ను బుధవారం ఘనంగా సన్మానించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చర్మ వ్యాధి నిపుణురాలుగా మంచి గుర్తింపు పొందిన ప్రియాంకను ఉత్తమ వైద్యురాలుగా గుర్తించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రియాంక తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. స్థానిక మార్గదర్శి పాఠశాలలో చురుకైనా విద్యార్థినిగా ప్రియాంక మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై మెడిసిన్ లో సీటు సంపాదించారు. అనంతరం వైద్యవృత్తిలో స్థిరపడి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రియాంకకు ఉత్తమ వైద్యులుగా అవార్డు రావడంపై స్థానికంగా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్