శ్రీరాముని జీవితం అందరికీ ఆచరణీయం
శ్రీరాముని జీవితం అందరికీ ఆచరణీయం
రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద
మంచిర్యాల, మార్చి,27(వెలుగు నాడు ప్రతినిధి) : శ్రీరాముడు ఆచరించిన జీవితం మన అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని మందమర్రి మండలం పాలచెట్టు ప్రాంతంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి సతీమణి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు లతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. శ్రీరాముడు నీతి, నిజాయితీ ఆచరించి ఆదర్శనీయంగా నిలిచారని, ఆధ్యాత్మిక మార్గం ద్వారా మనశాంతి కలుగుతుందని తెలిపారు. శ్రీరాముని ఆశయాలను అందరం అనుసరించాలని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో ప్రజల సౌకర్యార్థం సి సి రహదారులు, మురుగు కాలువ వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రజలకు వేసవిలో త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మందమర్రి మున్సిపల్ పరిధిలో 30 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టడం జరుగుతుందని, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక మనిషి జీవన విధానాన్ని శ్రీరాముడు ఆచరించి చూపారని, నీతి, నిజాయితీ కలిగి ఉండాలని తెలిపారు. శ్రీరాముడు ఆచరించిన జీవన విధానం అందరికీ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. శ్రీరాముడి స్ఫూర్తితో జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి జిల్లాలోని క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీ, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0