ఆంజనేయపురంలో ఉచిత పశు వైద్య శిబిరం
ఆంజనేయపురంలో ఉచిత పశు వైద్య శిబిరం
తిరువూరు జనవరి ( వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు మండలం, ఆంజనేయపురం గ్రామంలో వెటర్నరీ డాక్టర్ శ్వేత ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మామిడి కుటుంబరావు ప్రారంభించారు.ఈ శిబిరంలో ఎదకు రాని పశువులను పరీక్షించి అవసరమైన మందులు అందించారు. అలాగే గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కోసం ప్రత్యేక మందులను సరఫరా చేశారు.పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పశువులకు వైద్య సేవలు పొందారు. పశుసంపద ఆరోగ్యం మెరుగుపడితేనే రైతుల ఆర్థిక స్థితి బలపడుతుందని సర్పంచ్ మామిడి కుటుంబరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో మామిడి శరత్, షేక్ మస్తాన్, నరసింహారావు, షేక్ హిమాం, అల్లడి నాగేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సంధ్యారాణి, పశు వైద్య సిబ్బంది మరియు పాడి రైతులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0