కొత్త గనులు సింగరేణి కి ఇవ్వాలి, 47 వేల కోట్ల బకాయిలను ఇప్పించండి

Jan 25, 2026 - 21:10
 0  4
కొత్త గనులు సింగరేణి కి ఇవ్వాలి, 47 వేల కోట్ల బకాయిలను ఇప్పించండి

కొత్త గనులు సింగరేణి కి ఇవ్వాలి, 47 వేల కోట్ల బకాయిలను ఇప్పించండి.

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కి వినతి పత్రం ఇచ్చిన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి

కొత్తగూడెం,జనవరి 25, (వెలుగు నాడు ప్రతినిధి) : సింగరేణి కి కొత్త గనులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి కి రావాల్సిన 47 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరుతూ ఆదివారం కొత్తగూడెం పర్యటనకు వచ్చిన కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి కి గుర్తింపు సంఘం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సింగరేణి గుర్తింపు సంఘం, ప్రతినిధులు మరియు అధికారులతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ పలు సమస్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా సింగరేణిలో కొత్త మైన్స్ రాకపోవడం వల్ల సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, అదేవిధంగా 47 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరగా ఇప్పించి సంస్థ మనుగడను కాపాడాలని కోరారు. మరియు కార్మికులు ఇన్కమ్ టాక్స్ సమస్యను ఎదుర్కొంటున్నారని, పర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరారు, సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరిందని దానిని తగ్గించాలని కోరారు. సింగరేణి కి శాశ్వత సి అండ్ ఎండి లేకపోవడం వల్ల దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉపయోగపడేలా ఒక చట్టం సర్క్యులర్ కూడా అమలు కావడం లేదని అన్నారు, అదేవిధంగా సింగరేణిని కాపాడుకోవాలంటే కొత్త బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని,చీకటి సూర్యుల సమస్యలు తరితగతిన పరిష్కరించమని గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి ఆధ్వర్యం లో,కేంద్ర మంత్రి కి తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు మిర్యాల రంగయ్య, కే.సారయ్య, వై.వి.రావు, మడ్డి ఎల్లా గౌడ్, కే.వీరభద్రం, వంగ వెంకట్, రాంగోపాల్, రంగు శ్రీను, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్