భార్యపై హత్యాయత్నం పోలీసు అదుపులో భర్త
భార్యపై హత్యాయత్నం పోలీసు అదుపులో భర్త
మచిలీపట్నం మే17, (వెలుగు నాడు ప్రతినిధి) .కృష్ణా జిల్లా ఉయ్యూరులో, ఆదివారం దారుణం జరిగింది. కాటూరు రోడ్డులో భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడి రోడ్డుపై ఆమె తలపై బండ రాయితో దాడి చేశాడు. దీంతో ఆమె రక్తం మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి భర్తను గట్టిగా పట్టుకుని ఉయ్యూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని. బాధితురాలు పుష్పవతిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.దీంతో ఆమెను మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె భర్త సాంబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఉయ్యూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాంబయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయని పోలీసులకు పుష్పవతి బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిద్దరు వేర్వేరుగా జీవిస్తున్నారని పోలీసులకు వివరించారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0