డా.గుగ్గిళ్ళ దివ్యమూర్తికి ఇండియన్ ఐకాన్ (భారతీయ చిహ్నం)జాతీయ అవార్డు
డా.గుగ్గిళ్ళ దివ్యమూర్తికి ఇండియన్ ఐకాన్ (భారతీయ చిహ్నం)జాతీయ అవార్డు
పెద్దపల్లి,ఫిబ్రవరి08( వెలుగు నాడు ప్రతినిధి) : ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తికి ఇండియన్ ఐకాన్ (భారతీయ చిహ్నం)జాతీయ అవార్డు లభించింది.ఈ అవార్డును మల్కాజిగిరి జడ్జి బూర్గుల మధుసూదన్ చేతుల మీదుగా హైదరాబాదులోని చిక్కడపల్లిలో గల త్యాగరాయ గ్రామసభలో దివ్యమూర్తి అందుకున్నారు. నవభారత్ కళాక్షేత్రం వారు ఈ అవార్డును దివ్యమూర్తి ప్రతిభను గుర్తించి ఇవ్వడం జరిగింది. తదనంతరం డాక్టర్ దివ్యమూర్తిని పలువురు ప్రముఖులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ జాతీయ అవార్డు తనకు రావడం సంతోషదాయకమని డాక్టర్ దివ్యమూర్తి తెలియజేశారు. ఇప్పటివరకు తనకు 67 అవార్డులు వచ్చాయని, 117 వేదికల మీద సన్మానం జరిగిందని దివ్యమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ రంజిత్ కుమార్, తదితరులు , ప్రముఖ సామాజికవేత్త వీర భోగ వసంత రాయలు , హీరోయిన్ లక్ష్మి, అనిత, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0