దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతి

Mar 12, 2026 - 03:01
 0  6
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతి

దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు వితరణ 

పోలవరం, మార్చి 11,( వెలుగు నాడు ప్రతినిధి) : పోలవరం జిల్లా చింతూరు సబ్ డివిజన్ కూనవరం మండలం కోతులు గుట్ట కస్తూరిబాయి బాలికల స్కూల్ నందు పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 40 మంది స్కూల్ పిల్లలకు పరీక్ష ప్యాడ్లను దానధర్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది పిల్లలందరూ మంచిగా చదివి మంచిగా ఉత్తీర్ణత సాధించాలని బిజెపి మండలం మండలం మహిళా మోర్చా అధ్యక్షురాలు సోయం సుధారాణి తెలియడం జరిగింది దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ చింతూరు డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ పరీక్ష సమయంలో ఎటువంటి ఇబ్బందులు కు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. దానధర్మ చారిటబల్ ట్రస్టు ద్వారా పరీక్ష ప్యాడ్లు తీసుకున్నటువంటి పిల్లలు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిజెపి సీనియర్ నాయకులు రామారావు కళాశాల ప్రిన్సిపాల్ సున్నం స్వరాజ్యం సిబ్బంది మరియు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ చింతూరు డివిజన్ అధ్యక్షులు గీద శ్రీనివాసరావు పాల్గొన్నారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్