ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజలకు తాగునీరు ఫ్యాన్ల కొరత ఎండల్లో అవస్థలు పడుతున్న ప్రజలు

Jun 30, 2026 - 10:00
 0  9
ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజలకు తాగునీరు ఫ్యాన్ల కొరత ఎండల్లో అవస్థలు పడుతున్న ప్రజలు

ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజలకు తాగునీరు ఫ్యాన్ల కొరత ఎండల్లో అవస్థలు పడుతున్న ప్రజలు

జగ్గయ్యపేట, జూన్ 29, (వెలుగు నాడు ప్రతినిధి) : ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వచ్చిన ప్రజలకు ప్రభుత్వ కార్యాలయంలోనే కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగ్గయ్యపేట ఎమ్మార్వో కార్యాలయంలో మంచినీటి సౌకర్యం లేకపోవడం, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.ప్రతిరోజూ వివిధ ధృవపత్రాలు, రెవెన్యూ సంబంధిత పనుల కోసం వృద్ధులు, మహిళలు, రైతులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎమ్మార్వో కార్యాలయానికి వస్తుంటారు. అయితే మండుతున్న ఎండల నేపథ్యంలో తాగునీటి సౌకర్యం లేకపోవడం, కార్యాలయంలోని ఫ్యాన్లు తిరగకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వృద్ధులు, మహిళలు వేడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ కార్యాలయంలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకరమని ప్రజలు పేర్కొన్నారు.ప్రజలకు సేవలు అందించాల్సిన కార్యాలయంలో తాగునీరు, ఫ్యాన్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు వెంటనే కల్పించాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్