విజయవాడ పశ్చిమలో ఘనంగా స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఉదయభాను
విజయవాడ పశ్చిమలో ఘనంగా స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఉదయభాను
విజయవాడ జూన్ 28, (వెలుగు నాడు ప్రతినిధి) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనకు రెండేళ్లు - స్వర్ణోత్సవ కార్యక్రమాలు" అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగాయి. కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా, ప్రజల్లో జవాబుదారీతనాన్ని, పారదర్శకతను పెంపొందించే దిశగా సాగుతున్న ఈ ప్రయాణం నియోజకవర్గ అభివృద్ధికి ఒక దిక్సూచిగా నిలిచింది.ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని, సుపరిపాలన ప్రాధాన్యతను మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగాల్సిన కార్యాచరణను వివరించారు. కూటమి శ్రేణుల మధ్య ఉన్న సమన్వయం పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతుందని ఆకాంక్షించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0