ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా స‌ర్‌

Jun 30, 2026 - 09:37
 0  19
ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా స‌ర్‌

ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా స‌ర్‌

పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నానికి పెద్ద‌పీట‌

ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేష‌న్‌పై ప్ర‌త్యేక దృష్టి

క్షేత్ర‌స్థాయిలో ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

వత్సవాయి జూన్ 29,( వెలుగు నాడు ప్రతినిధి): భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌) ప్రక్రియను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహిస్తున్న‌ట్లు జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం వ‌త్స‌వాయి మండ‌లం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో క‌న్నెవీడు గ్రామంలో స‌ర్ ప్ర‌క్రియ జ‌రుగుతున్న తీరుతెన్నుల‌ను ప‌రిశీలించారు. బీఎల్‌వోల ద్వారా ఇంటింటి సంద‌ర్శ‌న ద్వారా ఎన్యూమ‌రేష‌న్ ఫారాల పంపిణీ, స్వీక‌ర‌ణ‌, డిజిటైజేష‌న్ కార్య‌క‌లాపాల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 16,45,597 (96.04 శాతం) ఎన్యూమ‌రేష‌న్ ఫారాల పంపిణీ జ‌రిగింద‌ని, అదేవిధంగా 3,10,995 (18.15 శాతం) ఫారాల డిజిటైజేష‌న్ పూర్త‌యింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో త్వ‌రిత‌గ‌తిన ఫారాల పంపిణీని పూర్తిచేయ‌డంతో పాటు డిజిటైజేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసేందుకు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు. స‌ర్ ప్ర‌క్రియ నేప‌థ్యంలో ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా బీఎల్‌వో-బీఎల్ఏ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ఓటర్ల సేవలో 1950 హెల్ప్‌లైన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లకు మెరుగైన సేవలు అందించేందుకు భారత ఎన్నికల సంఘం హెల్ప్‌డెస్క్‌ (1950 హెల్ప్ లైన్) అందుబాటులో ఉందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఓటర్లకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం, సమస్యల పరిష్కారం కోసం ఈ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా ఓటరు నమోదు, ఓటరు జాబితాకు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదులను పరిష్కరించుకోవచ్చ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. క‌లెక్ట‌ర్ వెంట నందిగామ ఆర్‌డీవో జి.అనిల్ కుమార్ ఉన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్