ముమ్మరంగా పల్స్ పోలియో
ముమ్మరంగా పల్స్ పోలియో
జగ్గయ్యపేట,జూన్ 28, ( వెలుగు నాడు ప్రతినిధి ) :జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో జగ్గయ్యపేట పట్టణంలోని విలియంపేట అంగన్‌వాడీ కేంద్రం,బాయ్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అక్కడ ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది నిర్వహిస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0