ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం మ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం మ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
గ్రామస్తుల అర్జీల స్వీకరణ కొత్త పెన్షన్లు, హౌసింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ.
కంచికచర్ల జూన్ 19, (వెలుగు నాడు ప్రతినిధి) : కంచికచర్ల మండలం, మున్నలూరు గ్రామంలో శుక్రవారం అధికారులు, కూటమి నాయకులతో కలిసి నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు వివరించి అర్జీలు అందజేశారు.ప్రజల సమస్యలను క్షుణ్ణంగా విన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కొత్త పెన్షన్లు, గృహ నిర్మాణ పథకాల కోసం వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోందని, ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వేగవంతంగా పరిష్కరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0