పోలీస్ స్టేషన్‌లో బ్యాడ్ క్యారెక్టర్స్‌కు కౌన్సిలింగ్ 

Jun 28, 2026 - 22:50
 0  19
పోలీస్ స్టేషన్‌లో బ్యాడ్ క్యారెక్టర్స్‌కు కౌన్సిలింగ్ 

పోలీస్ స్టేషన్‌లో బ్యాడ్ క్యారెక్టర్స్‌కు కౌన్సిలింగ్ 

 చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - సిఐ

ఇబ్రహీంపట్నం, జూన్ 28, (వెలుగు నాడు ప్రతినిధి) : ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం బ్యాడ్ క్యారెక్టర్స్ మరియు గంజాయి సేవించే వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లను ఉద్దేశించి ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎటువంటి చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడిన యెడల వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గంజాయి సేవించే వారు భవిష్యత్తులో గంజాయి తాగకుండా ఉండాలని సూచించారు. గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించి, సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సెక్టర్ ఎస్ఐ రవివర్మ,క్రైం ఎస్ఐ సేనాపతి శ్రీనివాస్,కొండపల్లి సెక్టర్ ఎస్ఐ చక్రదర్,మహిళా ఎస్ఐ సత్యవతి,స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్