డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులో మంజూరు చెయ్యాలి.పెన్షన్ నమోదుకు ఆన్లైన్ వెంటనే ప్రారంభించాలి.
డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులో మంజూరు చెయ్యాలి.పెన్షన్ నమోదుకు ఆన్లైన్ వెంటనే ప్రారంభించాలి.
జగ్గయ్యపేట,ఫిబ్రవరి 09 (వెలుగు నాడు ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం( ఎ పి డి కె ఎస్ ) ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం. కుటుంబరావు ఆధ్వర్యంలో పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం డప్పు కళాకారుల ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబరావు మాట్లాడుతూ పాటకు, ఆటకు గుర్తింపునిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డప్పుకు ఎందుకు గుర్తింపునివ్వడం లేదని మండిపడ్డారు. డప్పులు వాయించేది దళితులు కాబట్టే అంటరానివారిగా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేర్చుకున్న కళలకు రూ.7 వేలు పెన్షన్ ఇస్తుండగా, ప్రాచీన కళ డప్పును నమ్ముకున్న కళాకారులకు రూ. 4 వేలే ఇస్తారా..? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. డప్పు కళాకారుల వయోపరిమితిని 45కు తగ్గించి పెన్షన్ రూ. 7 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నార కాలం గడిచిపోయినా ఇప్పటివరకు డప్పు కళాకారుల పెన్షన్ కు ఆన్లైన్ ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డప్పు కళాకారులకు ధార్మిక క్షేత్రాల్లో ప్రదర్శనలకు, ట్రస్ట్ బోర్డుల్లో మెంబర్లుగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు కార్డులివ్వడంతో పాటు బస్సు, రైలు ప్రయాణల్లో రాయితీ ఇవ్వాలని సూచించారు. ఉండడానికి ఇల్లు, వ్యవసాయానికి రెండెకరాల భూమిని మంజూరు చేయాలన్నారు. డప్పు కళ అంతరించపోకుండా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. రూ.10 లక్షల ప్రమాద బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు. డప్పు కళాకారులు సమరశీల ఐక్య పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోగలరని నాయకులు పిలుపునిచ్చారు, డప్పు కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఐ యాకోబు, ఆదిమల్ల నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోట కృష్ణ,డప్పు కళాకారుల సంఘం ప్రతినిధులు ఆదిమల్ల సుధాకర్, నెమలి ఆదాం, ఇనుపనూర్తి నాగేశ్వరరావు, హుసేన్ తదితర డప్పు కళాకారులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0