ప్రేమ పేరుతో వేధింపులు హోం గార్డుపై కేసు

Jun 30, 2026 - 09:43
 0  11
ప్రేమ పేరుతో వేధింపులు హోం గార్డుపై కేసు

ప్రేమ పేరుతో వేధింపులు హోం గార్డుపై కేసు

హైదరాబాద్ జూన్ 29, (వెలుగు నాడు ప్రతినిధి) : ఓ వివాహితను ప్రేమ పేరుతో వేధించిన చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు చెందిన హోం గార్డుపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరిస్తూ వేధింపులకు హోం గార్డు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తూ, సంబంధిత ఆధారాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక హోం గార్డుపై తదుపరి చర్యలు తీసుకుంటామని చైతన్యపురి పోలీసులు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్