మెడికల్ లాబ్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 

Jun 30, 2026 - 10:05
 0  32
మెడికల్ లాబ్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 

మెడికల్ లాబ్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 

జగ్గయ్యపేట,జూన్ 29, ( వెలుగు నాడు ప్రతినిధి )  : పట్టణ సమీపంలోని డాల్పెన్స్ హోటల్ లో సోమవారం జగ్గయ్యపేట నియోజకవర్గ మెడికల్ లాబరేటరీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా షేక్ మహమ్మద్ అలీ, ఉపాధ్యక్షులుగా షేక్ జబ్బార్, కార్యదర్శిగా గరికపాటి రాజు, సహాయ కార్యదర్శిగా షేక్ మహబూబ్ సుభాని, కోశాధికారిగా కేతరాజు పార్థసారథి, కార్యవర్గ సభ్యులుగా కామినేని భూపాలరావు, కట్ట కోటేశ్వరరావు, గాలి చౌడయ్య, మార్తి వీర కృష్ణ, కొరముట్ల శివప్రసాద్, షేక్ షాబుద్దీన్ అహ్మద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యవర్గం సమావేశంలో పలు నిర్ణయాలను చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో లేబరేటరీ సభ్యులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్