లెప్రసీ అవగాహన ప్రచారకార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలి

Jan 30, 2026 - 12:18
 0  3
లెప్రసీ అవగాహన ప్రచారకార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలి

లెప్రసీ అవగాహన ప్రచారకార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలి

కుష్టు వ్యాధి నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు, జనవరి 29, (వెలుగు నాడు ప్రతినిధి ) : జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలన లక్ష్యంగా చేపట్టనున్న కార్యక్రమంలో భాగంగా "స్పర్శ" లెప్రసీ అవగాహన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు.గురువారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో వైద్య శాఖ వారి ఆధ్వర్యంలో "స్పర్శ" లెప్రసీ అవగాహన కార్యక్రమం సంబంధించిన కరపత్రాన్ని సంబంధిత వైద్యాధికారులతో కలిసి కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుష్టు వ్యాధిగ్రస్తులకు మహాత్మా గాంధీ చేసిన సేవలకు సూచకంగా ఆయన వర్ధంతి అయిన జనవరి 30ను ప్రతి సంవత్సరం “యాంటి లెప్రసీ డే”గా నిర్వహించబడుతున్నదని తెలిపారు. అన్ని ఆరోగ్య సంస్థల్లో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఈ సంవత్సరం "వివక్షతను అంతం చేయడం - గౌరవాన్ని కాపాడుదాం " అని థీమ్ తో జనవరి 30 నుండి ఫిబ్రవరి 13, వరకు 15 రోజుల పాటు జిల్లావ్యాప్తంగా "స్పర్శ" లెప్రసీ అవగాహన ప్రచార వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కాలంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాలు, వార్డులు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు, చికిత్స విధానాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆదేశించారు. కుష్టు వ్యాధిపై ఉన్న అపోహలు, వివక్షతను తొలగిస్తూ బాధితులకు గౌరవభావంతో సేవలు అందించాలని, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తి చికిత్స అందించడం ద్వారా నిర్మూలన సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డా. భాస్కర్, (డిఎన్ఎమ్ఓ) డా. జి. మల్లికార్జున రెడ్డి, డిసి హెచ్ ఎస్) డా. జఫ్రులా, (డి పి ఎం ఓ ఎస్) టి. చంద్రశేఖర్ రెడ్డి, వై. సుబ్రహ్మణ్యం తదితర వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్