వేసవి సెలవులలో శ్రీశైలానికి భక్తుల వెల్లువ
వేసవి సెలవులలో శ్రీశైలానికి భక్తుల వెల్లువ,
స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు, దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీశైలం మే 31, )వెలుగు నాడు ప్రతినిధి) : వేసవి సెలవులు, ఆదివారం కలిసి రావడంతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల సన్నిధికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 4:30 గంటల నుంచే క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయింది.స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం వందలాది మంది గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో, నుదుట బొట్టుతో బారులు తీరారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు, దేవస్థానం సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.భక్తుల సౌకర్యార్థం అదనపు షెడ్లు, తాగునీరు, అన్నప్రసాదం, వైద్య శిబిరాలను అధికారులు అందుబాటులో ఉంచారు. వేసవి సెలవులు, వారాంతాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటోందని, స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు ఓపికతో సహకరించాలని ఆలయ ఈవో యం.శ్రీనివాసరావు అన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0